చంద్రబాబు నివాసం కూల్చివేత కేసు 16కి వాయిదా

చంద్రబాబు నివాసం కూల్చివేత కేసు 16కి వాయిదా

అమరావతి: టీడీపీ నాయకుడు చంద్రబాబు నివాసం ఉంటున్న భవన కూల్చివేతపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన అక్రమ నిర్మాణంలో నివాసముంటున్నాడని గత శుక్రవారమే ఇల్లు ఖాళీ చేయాలంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసును సవాలు చేస్తూ హై కోర్టులో లింగమనేని రమేష్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

మంగళవారం ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది. కోర్టులో విచారణ  నేపథ్యంలో లో కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపి వేశారు అధికారులు.