
అమరావతి : తెలుగుదేశం శాసన సభ పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో టీడీపీ ఫ్లోర్ మీటింగ్ జరిగింది. సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. టీడీపీ శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును యునానిమస్ గా ఎన్నుకున్నారు నేతలు. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతను కూడా ఎన్నుకున్నారు.
మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ 3 పార్లమెంట్ స్థానాలను… 24 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది.