చంద్రయాన్ 3 రఫ్ బ్రేకింగ్ సక్సెస్

చంద్రయాన్ 3 రఫ్ బ్రేకింగ్ సక్సెస్

చంద్రుడి వైపు చంద్రయాన్ 3 ప్రయాణంలో కీలకమైన రఫ్ బ్రేకింగ్ ను విజయవంతం చేశారు శాస్త్రవేత్తలు. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ఉన్న చంద్రయాన్ 3 శాటిలైట్.. చంద్రుడిపైకి దిగే కీలకమైన స్టార్టింగ్ ఇది. 690 సెకన్లు.. అంటే 11 నిమిషాల పాటు ఈ జర్నీని విజయవంతం చేసింది ఇస్రో. 

రఫ్ బ్రేకింగ్ లో చంద్రయాన్ 3 శాటిలైట్ 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి 6.8 కిలోమీటర్లకు దిగింది. రఫ్ బ్రేకింగ్ తోపాటు ఆటిట్యూడ్ హెల్డ్ ను సైతం విజయవంతంగా ఆపరేట్ చేశారు. రఫ్ బ్రేకింగ్ తర్వాత 10 సెకన్లపాటు చంద్రయాన్ ను అలాగే నిలబెట్టిన శాస్త్రవేత్తలు.. అక్కడి నుంచి కిలోమీటర్ కిందకు దించారు. రఫ్ బ్రేకింగ్, ఆటిట్యూడ్ హోల్డ్ అనే రెండు దశలు సెక్సెస్ కావటం విశేషం.