
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పవన్, చంద్రబాబుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . సత్తెనపల్లిలో తనను ఓడించేందుకు కొత్త వస్తాదులను రంగంలోకి దింపుతున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. కొడాలి నాని, రోజాలను కూడా ఓడించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లికి వచ్చి మీటింగులు పెట్టారని.. తనను ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డిస్తున్నారనే విషయం స్పష్టంగా అర్దమవుతుందన్నారు.
చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఎన్ని పాచికలు వేసినా ఆయనను బీసీలు నమ్మరని అంబటి రాంబాబు అన్నారు. పూలే, అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా జగన్ పాలన సాగుతోంది. పథకాలకు అర్హులై ఉండి సకాలంలో దరఖాస్తులు చేసుకోకుండా మిగిలిపోయిన వారికి సైతం సీఎం లబ్ధి చేకూరుస్తున్నారు.