మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్ తీరులో కూడా మార్పులు వస్తున్నాయని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. సైబర్ కైమ్ ఇప్పుడు సవాల్‌గా మారిందన్నారు. ఈ దశలో ప్రజలకు త్వరగా సేవలందిచేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రూ.3 కోట్లతో నిర్మించిన కూకట్‌పల్లి న్యూ పోలీస్ స్టేషన్‌ను ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవ తీసుకుని తన క్యాంప్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని పోలీస్ స్టేషన్‌కు కేటాయించడం అభినందనీయమన్నారు. వెూతీనగర్‌లో కూడా ప్రత్యేక పోలీస్ స్టేషన్ నిర్మిస్తామని సజ్జనార్ తెలిపారు.

