అఫ్గాన్‌ క్రైసిస్ భారత్‌కు చాలెంజ్‌.. అందుకే స్ట్రాటజీ మార్పు

అఫ్గాన్‌ క్రైసిస్ భారత్‌కు చాలెంజ్‌.. అందుకే స్ట్రాటజీ మార్పు

రెండు యుద్ధాలు ఓడిపోయాక... పాకిస్తాన్... ఉగ్రవాదాన్ని తన విధానంగా మార్చుకుందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు, ట్రెయినింగ్ ఇస్తూ... భారత్ ను టార్గెట్ చేస్తోందని అన్నారు. అఫ్గనిస్తాన్ లో మారుతున్న పరిణమాలు భారత్ కు సవాల్ అని, అందుకే భారత్ తన వ్యూహాలను మారుస్తోందని చెప్పారు. క్వాడ్‌ దేశాల కూటమి ఏర్పాటు భారత్ వ్యూహంలో కీలకమైన స్టెప్‌ అని రాజ్‌నాథ్ అన్నారు.

ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఏర్పాటు చేయడంపై రక్షణ శాఖ సీరియస్ గా పనిచేస్తోందని రాజ్‌నాథ్‌ తెలిపారు. యుద్ధ సమయాల్లో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ గ్రూప్స్‌ ఏర్పాటుతో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. మన దేశంలో ఇంటిగ్రేటెడ్ ఫైటింగ్ యూనిట్స్ పెంచడంపై దృష్టి పెట్టామని చెప్పారు. యువతలో దేశ భక్తి పెంచడంతో పాటు క్రమశిక్షణ, ఆర్మీ పాటించే విలువలను పెంపొందించడంపై కృషి చేస్తున్నామన్నారు. మన దేశ యువతకు ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ను దగ్గర చేసేలా ‘టూర్‌‌ ఆఫ్ డ్యూటీ’ అని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యూత్ ఆర్మీలోకి వచ్చేందుకు ఈ రకమైన ప్రోగ్రామ్స్‌ ఉపయోగపడుతాయని ఆశిస్తున్నామన్నారు.

మరోవైపు 1971 పాకిస్తాన్ తో  యుద్ధం విజయోత్సవ  సంబరాలను   ఘనంగా నిర్వహిస్తోంది  ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ యుద్ధంతోనే  బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.  ఆ యుద్ధంలో  భారత్ విజయం సాధించి ఈ ఏడాది  50 ఏళ్లు పూర్తవుతున్నాయి.  స్వర్ణోత్సవ సంబరాలను  డిసెంబర్ లో గ్రాండ్ గా సెలబ్రేట్   చేయనున్నారు. ముంబయిలో  సైక్లథాన్ నిర్వహించింది  ఎయిర్ ఫోర్స్. సైక్లిస్టులు భారీగా ఈ ఈవెంట్ లో  పాల్గొన్నారు. విజయ జ్యోతి  సెప్టెంబర్ 1 న  ముంబయికి రానుంది.