సీఎం అభ్యర్థిని పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు

సీఎం అభ్యర్థిని పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు

జలంధర్: పంజాబ్ లో వచ్చే  నెలలో అసెంబ్లీ ఎన్నికల జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ  పార్టీ తమ సీఎం క్యాండిడేట్ ఎవరో  ప్రకటించి దూకుడు పెంచింది. కానీ అధికార కాంగ్రెస్ లో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు. టీపీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూతోపాటు ప్రస్తుత పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ సీఎం రేసులో ఉన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ కు విచ్చేసిన ఆయన.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారని రాహుల్ అన్నారు. 

‘పంజాబ్ ను ఎవరు నడపాలనే దానిపై సిద్ధూ, చన్నీతో చర్చించా. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎవరు నడిపిస్తారనేది ఇప్పుడు పంజాబ్ ముందున్న అతిపెద్ద ప్రశ్న అని చన్నీ, సిద్ధూజీలు  చెప్పారు. కానీ ఒకటి మాత్రం విస్పష్టం.. ఇద్దరు వ్యక్తులు పార్టీని నడపలేరు. ఒకరే నాయకత్వం వహించాలి. సీఎంగా ఎవరిని ఎంచుకున్నా కలసి పని చేయడానికి తాము సిద్ధమని చన్నీ, సిద్ధూలు నాకు మాటిచ్చారు’ అని రాహుల్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల  కోసం:

యోగి తప్పనిసరిగా గెలవాలి

పెళ్లి కూతురైన ‘నాగిని’ హీరోయిన్

నీ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం