ప్రజా ప్రభుత్వ గెలుపు ను జీర్ణించు కోలేకపోతున్నరు : పీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్

ప్రజా ప్రభుత్వ గెలుపు ను జీర్ణించు కోలేకపోతున్నరు : పీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్
  •     బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​పై పీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వ గెలుపును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును గుర్తించకుండా అది ఓ గెలుపేనా అని ఆయన అనడం ఓటరు తీర్పును అవమానించడమేనని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఫైర్ అయ్యారు. 

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసినా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు మాత్రం రేవంత్ సర్కార్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం గెలుపును గుర్తించి, ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. అలా చేయని పక్షంలో రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఘోర పరాభావం తప్పదని హెచ్చరించారు.