ఫేస్​ బుక్​ ‘బ్లూటిక్’కు చార్జ్​

ఫేస్​ బుక్​ ‘బ్లూటిక్’కు చార్జ్​
  • ఫేస్​ బుక్​ ‘బ్లూటిక్’కు చార్జ్​
  • ఫీజు నెల నెలా రూ.993

శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్ బాటలోనే తను కూడా నడవాలని ‘మెటా’ నిర్ణయించింది. ఫేస్​బుక్, ఇన్​స్టాలలో బ్లూటిక్​ఖాతాదారుల నుంచి చార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొంది. ఖాతాల నిర్ధారణకు, బ్యాడ్జిల నిర్వహణకు నెలవారీ ఫీజు వసూలు చేయనుంది. సెలబ్రెటీల ఖాతాలకు ఇప్పటికే అమలుచేస్తున్న బ్లూటిక్​కు ఇకపై నెల నెలా వసూళ్లు మొదలు పెట్టనుంది. ఖాతాల నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ.993 (11.99  డాలర్లు) చార్జ్ చేయనున్నట్లు మార్క్ జుకర్​ బర్గ్​ తెలిపారు. ఐఫోన్  ఆపరేటింగ్​ సిస్టంలలో అయితే నెలకు రూ.1,250 (14.99 డాలర్లు) ఫీజుగా నిర్ణయించామన్నారు. ఫేస్ బుక్, ఇన్​ స్టాలలో బ్లూటిక్​చార్జీలను తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ లలో ఈ వారంలోనే అమలులోకి తీసుకురాబోతున్నట్లు జుకర్​ బర్గ్​ తెలిపారు. కొత్తగా బ్లూటిక్​కావాలని అనుకునే వారు ఏదేనీ ప్రభుత్వ గుర్తింపు కార్డుతో తమ ఖాతాలను నిర్ధారించుకుని సబ్ స్క్రైబ్​ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్లాన్​ తీసుకున్నోళ్లు నేరుగా తమ కస్టమర్​ సర్వీస్ ను సంప్రదించవచ్చని వివరించారు. ఈ కొత్త ఫీచర్​తో ఫేస్​ బుక్, ఇన్​ స్టాల ఖాతాదారులకు మరింత గుర్తింపు, భద్రత లభిస్తుందని జుకర్​ బర్గ్​ తన ఫేస్​ బుక్​ అకౌంట్​ లో పోస్టు చేశారు.