తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో స్పెషల్ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. చార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొంది. మరో 12 మందికి సంబంధం ఉన్నట్టు కోర్టుకు సిట్అధికారులు తెలిపారు. పదిహేను నెలల పాటు 12 రాష్ట్రాల్లో సిట్ఎంక్వైరీ చేసింది.
ఈ కేసులో బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ కీలక సూత్రధారులుగా గుర్తించింది. ఏపీతోపాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఉన్నట్టు వెల్లడించింది. తొలుత కల్తీ నెయ్యి కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. కేసు మూలాలు తొలుత తమిళనాడులో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు భావించాయి. సీబీఐలోని డీఎస్పీలు, సీఐలతోపాటు ఏపీకి చెందిన 30 మంది అధికారులు ఈ ఎంక్వైరీలో పాల్గొన్నారు.
