వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి: మేడ్చల్​ కలెక్టరేట్​ వద్ద వడ్డెరలు ఆందోళన

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి: మేడ్చల్​ కలెక్టరేట్​ వద్ద  వడ్డెరలు ఆందోళన

శామీర్ పేట, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా వడ్డెర కులస్తుల్లో ఎలాంటి మార్పులు రాలేదని.. ప్రభుత్వం స్పందించి వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఆయిలామల్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తూముకుంట దొంగల మైసమ్మ చౌరస్తా నుంచి మేడ్చల్​జిల్లా కలెక్టరేట్ వరకు వడ్డెర కులస్తులు ర్యాలీ నిర్వహించారు. 

కలెక్టరేట్ ముందు బైఠాయించి ఎస్టీ జాబితాలో చేర్చాలని నినాదాలు చేశారు. ఆయిలామల్లు మాట్లాడుతూ.. ఉప్పల్ బగాయత్​భూమిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లతో వడ్డెర ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వారికుప్పల మల్లేశ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి ఉమ, నాయకులు గణేశ్, సంఘం మేడ్చల్ జిల్లా వైస్ చైర్మన్ గిరిశెట్టి రాజు, అధ్యక్షుడు తిరుపతి  పాల్గొన్నారు.