డాక్టర్లు విఫలమైన చోట AI విజయం..ChatGPT ఓ జీవితాన్ని కాపాడింది

డాక్టర్లు విఫలమైన చోట AI విజయం..ChatGPT ఓ జీవితాన్ని కాపాడింది

అడ్వాన్స్ డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సామర్థ్యాలకు అద్భుతమైన నిదర్శనం ఈ సంఘటన. ఏళ్లకు తరబడి పేరున్న డాక్టర్లు కూడా కనిపెట్టలేని రోగాన్ని AI ఇట్టే డయాగ్నస్ చేసింది.చనిపోతుందనుకున్న మహిళ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపి ఆమెను బతికించింది. పేరున్న డాక్టర్లు కూడా తన తల్లికు ఉన్న జబ్బు ఏంటో చెప్పలేకపోతే.. OpenAI ChatGPT తన తల్లి జీవితాన్ని ఎలా కాపాడిందో తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ స్టోరీని షేర్ చేసింది.ఈ స్టోరీ ఏడాది పాటు టాప్ డాక్టర్లు డయాగ్నసిస్ చేయని రోగాన్ని AI ఇట్టే కనిపెట్టిన ఆసాధారణ సందర్భం హైలైట్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. 

ఇండియాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రేయ..సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో OpenAI ChatGPT తన తల్లి ప్రాణాలను కాపాడటానికి ఎలా సహాయపడిందో తెలిపే హార్ట్ టచింగ్  స్టోరీని షేర్ చేసింది. పోస్ట్ ప్రకారం.. శ్రేయ తల్లి 18 నెలలకు పైగా నిరంతర దగ్గుతో బాధపడుతోంది. ఫేమస్ డాక్టర్లను సంప్రదించినా ఫలితంగా లేకుండా పోయింది. లేటెస్ట్ అల్లోపతి నుంచి  సాంప్రదాయ హోమియోపతి ,ఆయుర్వేదం వరకు అన్ని ట్రీట్ మెంట్లను తీసుకుంది. అయినా ఆమె తల్లి పరిస్థితి మరింత దిగజారింది. ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగితే అది ప్రాణాంతకం కావచ్చు అని డాక్టర్లు బాంబు పేల్చారు. దీంతో శ్రేయ కుటుంబం మరింత భయాందోళనకు గురయ్యారు. 

ALSO READ | బ్యాటరీలను తానే మార్చుకున్న హ్యూమనాయిడ్ రోబో

డాక్టర్లు స్టేట్ మెంట్ తో తీవ్ర నిరాశలో ఉన్న శ్రేయ OpenAI ChatGPT ని ఆశ్రయించింది. ఆమె తన తల్లి రోగానికి సంబందించిన లక్షణాలు, ఆమె హెల్త్ హిస్టరీని,చేయించిన టెస్టులు, అందించిన ట్రీట్ మెంట్లకు సంబంధించిన వివరాలను ఇన్‌పుట్ చేసింది.

ChatGPT అందించినది ఖచ్చితమైన రోగ నిర్ధారణ కానప్పటికీ అసలు కారణాన్ని మాత్రం తెలిపింది. ఆమె తల్లి రక్తపోటు మందుల సైడ్ ఎఫెక్టే ఇందుకు కారణమని తేల్చింది. శ్రేయ తన తల్లి నిజంగానే అలాంటి మందులనే తీసుకుంటున్నట్లు నిర్ధారించుకుంది. ఆ తర్వాత ChatGPT శ్రేయను ప్రశ్నను అడిగింది.."ఆమె ఈ పదార్థాన్ని ఉపయోగించి BP మందులు తీసుకుంటుందా?" శ్రేయ అవును అని సమాధానం చెప్పింది. ఇది ఆమె తల్లి వైద్య సంప్రదింపుల సమయంలో హైలైట్ చేయని విషయం ఇది. 

ChatGPT ఇచ్చిన సలహాతో శ్రేయ వెంటనే తన తల్లి డాక్టర్ ను సంప్రదించింది. సమాచారం ,ప్రశ్నలోని నిర్దిష్ట మందులను సమీక్షించిన తర్వాత డాక్టర్ లింక్‌ను ధృవీకరించి వెంటనే మెడిసిన్ ను మార్చారు. ప్రస్తుతం శ్రేయ తల్లి కోలుకోంటోంది. ఎంతో రిలాక్స్ గా ఫీలైన శ్రేయ.. తన అనుభవాన్ని X లో పంచుకుంది. ChatGPT తన తల్లి ప్రాణాలను కాపాడిందని చెప్పడం అతిశయోక్తి కాదు. అని పోస్ట్  చేసింది.