
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరి గుట్టలోని రంగారెడ్డి నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భాగ్య నగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొని రిటైర్డ్ అయిన ఆర్మీ సిబ్బందికి ఛత్రపతి శివాజీ పురస్కారాలను ప్రదానం చేశారు. మొత్తం 75మందికి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్, వడేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.