కీలక మలుపు తిరిగిన చీకోటి ప్రవీణ్ కేసు

కీలక మలుపు తిరిగిన చీకోటి ప్రవీణ్ కేసు

చీకోటి ప్రవీణ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. 2023 జూలై 16 ఆదివారం రోజున  హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రైవేటు సెక్యూరిటీతో వచ్చారు. అయితే అక్కడ తన గన్ మెన్ తుపాకీతో హల్ చల్ చేయడంతో అతని గన్ మెన్ ల నుండి గన్ లను లాక్కున్నారు.  అనంతరం వారిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి ఛత్రినాక పోలీసులకు గన్ లనుఅప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

 అయితే ఇప్పుడు ఈ కేసులో A1 గా చీకోటి ప్రవీణ్ పేరును చేర్చారు పోలీసులు.  A - 2గా సుందర్ నాయక్, A - 3గా రమేష్ గౌడ్, A - 4గా రాకేష్ కుమార్‌లను చేర్చి వారిపై 420,467,468,471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.   A1 చీకోటి ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు చూపిస్తూ..   మిగితా ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3  గన్ లను స్వాధీనం చేసుకొని  రిమాండ్ కు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు.  జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు ఈ కేసులు పెట్టారు.