IND vs AUS: ఒకే బౌలర్ చేతిలో ఎక్కువ సార్లు ఔట్.. పుజారా చెత్త రికార్డు

IND vs AUS: ఒకే బౌలర్ చేతిలో ఎక్కువ సార్లు ఔట్.. పుజారా చెత్త రికార్డు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ చటేశ్వర పుజారా చెత్త రికార్డును నెలకొల్పాడు. వన్ డౌన్ లో వచ్చిన పుజారా 4 బంతులు ఎదుర్కొని లియాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన చెత్త రికార్డును పుజారా తన పేరిట రాసుకున్నాడు. అయితే, లియాన్ పుజారాను ఔట్ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ చేతిలో కూడా పుజారా 12 సార్లు ఔటయ్యాడు. దీంతో గవాస్కర్ తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధికసార్లు ఔటైన 2వ బ్యాటర్ గా పుజారా నిలిచాడు. 

ఈ మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు పడగొట్టిన లియాన్.. షేన్ వార్న్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఆసియా పిచ్ లపై అత్యధిక వికెట్లు (129) తీసిన పర్యాటక బౌలర్ గా లియాన్ రికార్డు నెలకొల్పాడు. 127 వికెట్లు తీసిన షేన్ వార్న్ ను లియాన్ అదిగమించాడు. లియాన్ జడేజా వికెట్ తీయడంతో ఈ ఘనత సాధించాడు.