ఫేస్​ రికగ్నైజేషన్​ యాప్​తో దొంగ ఓట్లకు చెక్!

ఫేస్​ రికగ్నైజేషన్​ యాప్​తో దొంగ ఓట్లకు చెక్!
  • డివిజన్​కో పోలింగ్​ సెంటర్​ లెక్కన 150 చోట్ల అమలు
  • గతంలో యాప్​లో పలు టెక్నికల్​ సమస్యలు
  •  పక్కాగా ఫేస్​ రికగ్నైజేషన్​ ఉంటుందన్న ఎలక్షన్​ కమిషన్
  •  యాప్​ వినియోగానికి అభ్యంతరం చెప్పిన మజ్లిస్

హైదరాబాద్, వెలుగుదొంగ ఓట్ల సమస్యకు చెక్​పెట్టేలా ఓటర్ల ఫేస్​రికగ్నైజేషన్​ యాప్​ను వినియోగించేందుకు రాష్ట్ర ఎలక్షన్​ కమిషన్​ ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో ఒక్కో పోలింగ్​ స్టేషన్ లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఓటర్లు వెంట తెచ్చే ఐడెంటెటీ కార్డులతో సంబంధం లేకుండా యాప్​ సాయంతో వారిని ఈజీగా గుర్తించవచ్చు. దీనిలో భాగంగా యాప్​ సాయంతో ఓటర్​ ఫేస్​ను ఫొటో తీస్తారు. యాప్​ ఈ ఫొటోను ఎలక్షన్​ కమిషన్​ డేటాబేస్​లోని సదరు ఓటరు ఫొటోతో సరిపోల్చి రిజల్ట్​ ఇస్తుంది. పది సెకన్లలోనే రిజల్ట్​ వస్తుందని ఎలక్షన్​ కమిషన్​ చెప్తోంది.

దొంగ ఓట్లు పడకుండా..

ఇటీవలి మున్సిపల్​ ఎలక్షన్ల సమయంలో మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీలో ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌‌ను ప్రయోగాత్మకంగా వాడారు. అప్పుడు పలు టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ వచ్చాయి. పోలింగ్​ లేటవుతోందని కొందరు ఓటర్లకే దానిని పరిమితం చేశారు. ఈసారి అట్లాంటి టెక్నికల్​ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈసీ అధికారులు చెప్తున్నారు. ఈ యాప్‌‌తో ఓటర్లను త్వరగా గుర్తించి, రియల్​టైం అథెంటికేషన్​ పొందవచ్చని అంటున్నారు. ఎవరైనా ఇతరుల పేరిట ఓట్లు వేయకుండా, దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్తున్నారు.

ఆ ఫోటోలు భద్రపర్చం: ఈసీ

ఫేస్‌‌  రికగ్నైజేషన్‌‌ యాప్‌‌ ద్వారా తీసే ఓటర్ల ఫొటోలను భద్రపర్చబోమని, అథెంటికేషన్​ పూర్తవగానే డిలీట్​ చేస్తామని స్టేట్ ఎలక్షన్​ కమిషన్​ ప్రకటించింది. ఈ యాప్​వినియోగానికి సంబంధించి… ఒక పోలింగ్ అధికారి ఓటరు ఐడీని చెక్​ చేస్తారు. తర్వాత ఓటరు ఫోటో తీసి.. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ సాయంతో స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సర్వర్‌‌ కు అప్‌‌లోడ్ చేస్తారు. ఆ సర్వర్‌‌  సెర్చ్ చేసి వచ్చిన ఓటర్​ సదరు వ్యక్తి అవునా, కాదా? ఇంతకు ముందు ఓటు వేశాడా లేదా అన్న సమాచారాన్ని ఇస్తుంది. ఈ రిజల్ట్​ రాగానే సదరు ఓటరును ఓటు వేయడానికి అర్హుడా, కాదా
నిర్ణయిస్తారు.