టెన్షన్లకి చెక్ పెట్టండిలా..

టెన్షన్లకి చెక్ పెట్టండిలా..

ఆన్లైన్లోయోగా,మెడిటేషన్ క్లాసులు
అటెండ్ అవుతున్న వారిలో జాబర్స్ తో పాటు యూత్, పిల్లలు
వర్చువల్ సెషన్స్ కండక్ట్ చేస్తున్న సెంటర్లు
ప్రెజర్ నుంచి రిలీఫ్ పొందేందుకు ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్, లాక్ డౌన్.. సిటిజన్స్ లైఫ్ స్టైల్ లో చాలా ఛేంజస్ వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ టెన్షన్, వైరస్ ఫోబియా, యాంగ్జైటీనెస్, చిరాకు, కోపం వంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తున్నారు. రోజుల తరబడి ఒకేచోట ఉండటం వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అలా టెన్షన్ పడుతున్న వారిలో జాబర్స్ తో పాటు యూత్, చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. అందులోనూ 16–21, 25–30 ఏండ్ల లోపు వారే ఎక్కువ. ఫ్యామిలీ ప్రెజర్స్, సూసైడ్ థాట్స్, వర్క్ స్ట్రెస్, యాంగ్జైటీ, లోన్లీ నెస్ నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామంది మెడిటేషన్, యోగాపై ఫోకస్ చేస్తున్నారు. మెడిటేషన్ సెంటర్లు కూడా మానసికంగా బాధపడుతున్నవారి కోసం ధ్యానంతో పాటు ఎక్సర్ సైజ్,
సైకాలజిస్ట్ తో స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఆన్ లైన్ లోనే మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయిస్తున్నాయి. లాక్ డౌన్లో కయ్లింట్స్ సంఖ్య పదింతలకు పైగా పెరిగిందని నిర్వాహకులు చెప్తున్నారు.

బ్రీతింగ్ ఎక్సర్ సైజులు కూడా..
ధ్యానం, యోగా మాత్రమే కాకుండా ప్రాణాయామం కూడా కలిపి క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. బ్రీతింగ్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కరోనా వైరస్ త్వరగా అటాక్ అయ్యే ప్రమాదముంది. అందుకోసం మెడిటేషన్ సెంటర్లలో పనిచేసే ట్రైనర్స్ కి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. యోగా ట్రైనర్స్ కూడా ఆసనాల్లో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లను ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు. వర్చువల్ గా కయ్లింట్ తో ఇంటరాక్ట్ అవుతూ లైవ్ సెషన్స్ ద్వారా 30 నిమిషాల నుంచి గంట పాటు క్లాసులు తీసుకుంటున్నారు.

పిల్లలకు వీకెండ్స్ టైంలో…
జనతా కర్ఫ్యూ తర్వాత పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులతో 5 నుంచి 14 ఏండ్ల పిల్లల్లో స్ట్రెస్, యాంగ్జైటీ లెవల్స్ పెరుగుతున్నాయి. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల ప్రెజర్, ఒకే చోట ఉండటం వల్ల ఒబెసిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతో పిల్లలను నార్మల్ చేసేందుకు కిడ్స్ యోగా అందుబాటులోకి తెచ్చారు. ఇంక్రీజెస్ మెమోరీ, కాన్స్ట్రేషన్, గ్రోత్, స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, కో- ఆర్డినేషన్, సెల్ఫ్ ఇస్టీమ్, సెన్స్ ఆఫ్ కామ్ నెస్, మైండ్ ఫుల్ నెస్, రిలీవ్స్ స్ట్రెస్, యాంగ్జైటీ రెగ్యు లేట్స్ ఎమోషన్స్, ఒబెసిటీ వంటివి బేస్ చేసుకుని వీకెండ్స్ లో ఉదయం, సాయంత్రం కండక్ట్ చేస్తున్నారు. పిల్లల్లో ఫోన్ అడిక్షన్, యాంగ్జైటీ లెవల్స్ తగ్గించేందుకు పేరెంట్స్ కు కూడా యోగా నేర్పిస్తున్నారు.

సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేందుకు..
కరోనాతో కొద్ది మంది ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. అదే వారిని మానసికంగా కుంగదీస్తోంది. మెడిటేషన్ తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. సిటీలో సహజ ధ్యాన కేంద్రాలు 30 ఉన్నాయి. ఒక్కో సెంటర్లో ముగ్గురు, నలుగురు ట్రైనర్స్ ఉన్నారు. లాక్డౌన్ లో మెడిటేషన్ నేర్చుకునేందుకు 3 వేల మంది వరకు జాయిన్ అయ్యారు.ఉదయం, సాయంత్రం క్లాసులు నిర్వహిస్తున్నాం.
– మల్లారెడ్డి, కో ఆర్డినేటర్, సహజ ధ్యాన కేంద్రం

సైకాలజిస్ట్ తో సెషన్స్
సిటీలో గతంలో నెలకు 3 వేల నుంచి 15 వేల మంది మెడిటేషన్ క్లాసులకు అడెంట్ అయ్యేవారు. లాక్డౌన్ తర్వాత ఆ సంఖ్య 35 వేలకి పైగా చేరింది. మా దగ్గర వర్చువల్ క్లాసుల కోసం 30 మంది ట్రైనర్స్ ఉన్నారు. డైలీ సెషన్స్ కండక్ట్ చేస్తారు. మెడిటేషన్ తో పాటు ప్రాణాయామం కూడా నేర్పిస్తున్నారు. ధ్యానంతో పాటు చాలామంది డిప్రెషన్ ప్రాబ్లమ్ తో కాంటాక్ట్ అవుతున్నారు. వారికి సైకాలజిస్ట్ ద్వారా క్లాసులు ఇప్పిస్తున్నాం.
– వంశీ చల్లాగుల్లా, హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ సెంటర్ జాయింట్ సెక్రటరీ

డైలీ రెండు బ్యాచ్లు
లాక్డౌన్ కు ముందు 45 మంది స్టూడెంట్స్ కి యోగా ట్రైనింగ్ ఇచ్చేవాణ్ని. ఇప్పుడు వంద మందికిపైగా వస్తున్నారు. వర్చువల్ గా సెషన్స్ కండక్ట్ చేస్తున్నా. ఇతర రాష్ట్రాల వారితోపాటు అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లూ అటెండ్ అవుతున్నారు. బాడీలో ఇమ్యూనిటీ పెరిగేలా ఆసనాలు నేర్పిస్తున్నా. డైలీ 2 బ్యాచ్లకు క్లాసులు తీసుకుంటున్నా. 20 మంది కిడ్స్ ఉన్నారు.
– దుర్గేశ్,యోగా ట్రైనర్

For More News..

ఏపీలో దళితుడికి గుండు ఘటనపై రాష్ట్రపతి సీరియస్

రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలు దాటిన సాగు

అసెంబ్లీ ముందుకు ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్