గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తనిఖీలు : డీసీపీ

గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తనిఖీలు : డీసీపీ

తెలంగాణ రాష్ట్రంను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు నిరంతరం తనిఖీలు చేపట్టనున్నామని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ దరావత్ జానకి ఐపీఎస్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారని చెప్పారు. మలక్ పేట మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్ ల వద్ద మలక్ పేట,చాదర్ఘాట్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

 అనుమానితుల పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గంజాయి రవాణాను అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో విక్రయాలు, వినియోగం చేసేవారిపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. ప్రయాణాల్లో ఎలాంటి అనుమానం కలిగిన పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు.