అనిల్ చేతులమీదుగా చెడ్డి గ్యాంగ్ తమాషా ఫస్ట్లుక్

అనిల్ చేతులమీదుగా చెడ్డి గ్యాంగ్ తమాషా ఫస్ట్లుక్

వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన  "చెడ్డిగ్యాంగ్ తమాషా" సినిమా ఫస్ట్లుక్ రిలీజైంది. శనివారం ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా చెడ్డిగ్యాంగ్ తమాషా మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ మూవీ టైటిల్ పోస్టర్ చాలా ఇంప్రెసివ్గా ఉందన్నారు. చెడ్డిగ్యాంగ్ తమాషా ఆడియెన్స్ను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని.. నిర్మాత, డైరెక్టర్కి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరారు. యూనిట్ అందరికీ అభినందనలు తెలిపారు. నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ఫస్ట్లుక్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు. హీరో వెంకట్ కళ్యాణ్ సరసన గాయంత్రి పటేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీలీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో  సిహెచ్ క్రాంతి కిరణ్  నిర్మాణించారు. హీరో, స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వెంకట్ కళ్యాణ్. 

హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్ నల్లగొప్పుల
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్