నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుపై హర్షం

నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుపై హర్షం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: నర్సింగ్ డైరెక్టరేట్​కు అనుకూలంగా క్యాబినెట్​లో నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్​అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ , నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవి కిరణ్,  ప్రధాన కార్యదర్శి శివ సాయి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నర్సింగ్ డైరెక్టరేట్ పై సానుకూలం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సీఎం  రేవంత్​ రెడ్డికి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.