మాక్లూర్, వెలుగు: నిజామాబాద్జిల్లా మాక్లూర్మండలంలోని గంగరమంద వరి పొలాల్లో రెండు చిరుతపులి పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతులకు చిరుత పిల్లలు కనిపించడంతో సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్చేయడంతో వైరల్అయ్యాయి. స్పందించిన ఫారెస్ట్ఆఫీసర్లు చిరుత పిల్లలు సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ఎవరూ భయాందోళన చెందొద్దని, పొలాల్లో తిరిగే రైతులు అలర్ట్గా ఉండాలని ఆఫీసర్లు సూచించారు.
