పొలం గారెలు.. ఇవి తింటే బాగా బలం వస్తుంది.. అందుకే పూర్వం అలుపు..సొలుపు లేకుండా పనిచేసేవారు..!

పొలం గారెలు.. ఇవి తింటే బాగా బలం వస్తుంది.. అందుకే పూర్వం అలుపు..సొలుపు లేకుండా పనిచేసేవారు..!

 


 ఎంత ఎండాకాలమైనా సరే.. పూర్వ కాలంలో  అలుపు.. సొలుపు లేకుండా పని చేసేవారు.  సమ్మర్​ అయినా.. వింటర్​ అయినా పని విషయంలో వెనకడుగు వేసే వారు.  అదిరిపోయే ఎండలో కూడా చిటికెలో బాడీని కూల్​ చేసే.. బలమైన ఆహారాన్ని ఒక పట్టు పట్టి ... పంచ పైకి కట్టారంటానా ఇక వారికి అప్పగించిన పని పూర్తవ్వాల్సిందే.. మరి అలాంటి బలవర్దకమైన ఆహారం ఏంటి.. ఎలా తయారు చేయాలి.. తయారీకి ఏమేమి కావాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

పొలం గారెలు.. ఈ పేరు కొత్తగా ఉన్నా సరే.. మన పూర్వీకులు ఇలాంటి బలమైన ఆహారాన్ని ఎక్కువుగా తినే వారు.  ఇవి క్షణాల్లో శరీరాన్ని కూల్​ చేస్తాయి.. వింటర్​ లో అయితే శరీరానికి కావలసిన వెచ్చదననాన్ని ఇస్తాయి.  పొలం గారెలు వీటినే సొరకాయ గారెలు అని కూడా అంటారు. 

పొలం గారెలు తయారీకి కావలసినవి

  • సొరకాయ ముక్కలు : ఒక కప్పు 
  • ఉల్లిపాయలు:  రెండు 
  • పచ్చిమిర్చి:  నాలుగు 
  • అల్లం ముక్క : చిన్నది  
  • కరివేపాకు :10  ఆకులు 
  • కొత్తిమీర :అర కట్ట  ( తరగాలి)
  • జీలకర్ర పొడి:  ఒక టేబుల్ స్పూన్    
  • ఉప్పు : రుచికి సరిపడా  
  • నూనె :  వేగేందుకు పరిపడా 

పొలం గారెలు తయారీ విధానం

సొరకాయ ముక్కలను ఉప్పు నీటిలో కడిగి రెండుగంటల పాటు నీటిలో నానబెట్టాలి.  ఆతరువాత వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి.  మరరీ జోరుగా ఉండకూడదు,  కచ్చాపచ్చాగా ఉండాలి.  ఆ తరువాత కొద్దిగా నీటిని పోసి బాగా మిక్స్​ చేయండి. లేదా ఒక్క సెకన్​ మిక్సీ వేయండి. 

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని  ముందుగా కట్​ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి.. ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్​, కొత్తిమీర, కరివేపాకు ఆకులు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. 

ఆ తరువాత స్టవ్​ వెలిగించి కళాయి లో నూనె పోసి వేడి చేయాలి.  అది వేడిగా అయిన తరువాత పిండిని అరచేతిని తడి చేసుకొని చిన్న చిన్న గారెలుగా చేసి నూనెలో మీడియం ఫ్లేంలో వేగించాలి. గోల్డ్​ కలర్​ లోని మారేంత వరకు  అటూ ఇటూ తిప్పుతూ వేయించాలి. . అంతే వేడి వేడి సొరకాయ గారెలు రెడీ. వీటినీ పల్లీల చట్నీ లేదా మామిడి చట్నీతో తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది.