హైదరాబాద్, వెలుగు: సిటీ కాలేజీలో కెమిస్ట్రీ జాతీయ సదస్సును ఈనెల19,20 తేదీల్లో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ బాల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘రసాయనశాస్త్రం, -బహుశాస్త్రంతర పరిశోధనా అవకాశాలు’ అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో లారస్ ల్యాబ్స్, ఎస్ఎస్ కే బయో సైన్సెస్ సహకారంతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కెమిస్ట్రీ విభాగం అధ్యక్షుడు ఏలూరి యాదయ్య సమన్వయం చేసే ఈ సదస్సులో రాష్ట్ర, రాష్ట్రేతర అధ్యాపకులు, ఆచార్యులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తొలిరోజు ప్రారంభ సభలో ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, ప్రముఖ పరిశోధకులు సీహెచ్. సుబ్రహ్మణ్యం, కె.రాజేందర్ రావు, ఎన్. రవికుమార్ రెడ్డి, పి.దివాకర్ పాల్గొంటారని వివరించారు.
