చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ లో అర్జున్‌‌ ఆరో గేమ్‌‌ డ్రా

చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ లో అర్జున్‌‌ ఆరో గేమ్‌‌ డ్రా

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఎరిగైసి అర్జున్‌‌ చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌లో మరో డ్రా నమోదు చేశాడు. మాస్టర్స్‌‌ కేటగిరీలో భాగంగా మంగళవారం జర్మనీ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ విన్సెంట్‌‌ కీమర్‌‌తో జరిగిన ఆరో రౌండ్‌‌ గేమ్‌‌ను డ్రాగా ముగించాడు. కీమర్‌‌ క్వీన్స్‌‌ పాన్‌‌తో ఆట మొదలుపెట్టగా, అర్జున్‌‌ స్లావ్‌ డిఫెన్స్‌‌తో స్పందించాడు. స్టార్టింగ్‌‌లో జర్మన్‌‌ ప్లేయర్‌‌ జోరు చూపెట్టినా మధ్యలో తెలంగాణ జీఎం డ్రా వైపు మళ్లించాడు. 

ఈ రౌండ్‌‌ తర్వాత అర్జున్‌‌ మూడున్నర పాయింట్లతో ఉండగా, కీమర్‌‌ 4.5 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు. అమెరికా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అవాండర్‌‌ లియాంగ్‌‌ తో గేమ్‌‌లో ప్రణవ్‌‌ నెగ్గాడు. విదిత్‌‌ గుజరాతీ.. అనిష్‌‌ గిరి మధ్య జరిగిన గేమ్‌‌ డ్రా అయ్యింది. చాలెంజర్స్‌‌లో ద్రోణవల్లి హారిక.. ఆర్‌‌. వైశాలి పై నెగ్గింది. మరో గేమ్‌‌లో ఆధిబన్‌‌.. దీప్తయాన్‌‌ ఘోష్‌‌ను ఓడించాడు.