కాన్వే, శివమ్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీలు..49 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో కోల్‌‌‌‌కతాపై చెన్నై గ్రాండ్‌‌‌‌ విక్టరీ

కాన్వే, శివమ్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీలు..49 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో కోల్‌‌‌‌కతాపై  చెన్నై గ్రాండ్‌‌‌‌ విక్టరీ

కోల్‌‌‌‌కతా: ఎన్నడూ చూడని స్కూప్‌‌‌‌ షాట్స్‌‌‌‌, తిరుగులేని పుల్‌‌‌‌ షాట్స్‌‌‌‌, సిగ్నేచర్‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌తో చెలరేగిన అజింక్యా రహానె (29 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 71 నాటౌట్‌‌‌‌).. ఈడెన్‌‌‌‌లో పరుగుల తుఫాన్‌‌‌‌ సృష్టించాడు. డేవన్‌‌‌‌ కాన్వే (40 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 56), శివమ్‌‌‌‌ దూబే (21 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 50) కూడా హాఫ్‌‌‌‌ సెంచరీలతో అండగా నిలవడంతో.. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌‌‌‌లో సీఎస్కే 49 రన్స్‌‌‌‌ తేడాతో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 రన్స్‌‌‌‌ చేసింది. స్టార్టింగ్‌‌‌‌ నుంచే కేకేఆర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను కాన్వే, రుతురాజ్‌‌‌‌ (35) చితక్కొట్టారు. తొలి వికెట్‌‌‌‌కు 45 బాల్స్‌‌‌‌లోనే 73 రన్స్‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత రహానె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టెస్ట్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ అనే ముద్రను చెరిపేస్తూ ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టాడు. 13వ ఓవర్‌‌‌‌లో కాన్వే ఔట్​తో రెండో వికెట్‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 24 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన రహానెతో కలిసి శివమ్‌‌‌‌ దూబే కోల్‌‌‌‌కతా బౌలింగ్‌‌‌‌ను ఊచకోత కోశాడు. ఈ ఇద్దరు 32 బాల్స్‌‌‌‌లోనే 85 రన్స్‌‌‌‌ జత చేశారు. దూబే 20 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ ఫినిష్‌‌‌‌ చేసి ఔటయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా (18), రహానెతో ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌ సమకూర్చాడు. 

రింకూ, రాయ్‌‌‌‌ మెరుపులు

ఛేజింగ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతా 20 ఓవర్లలో 186/8 స్కోరే చేసింది. జేసన్‌‌‌‌ రాయ్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 61) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తొలి రెండు ఓవర్లలోనే నారాయణ్‌‌‌‌ జగదీశన్‌‌‌‌ (1), నరైన్‌‌‌‌ (0) ఔటయ్యా రు. వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (20), నితీశ్‌‌‌‌ రాణా (27) ఓ మాదిరిగా ఆడారు. 46/3 వద్ద క్రీజులోకి వచ్చిన రాయ్‌‌‌‌ 5 భారీ సిక్సర్లు బాదాడు. రింకూ సింగ్‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 53 నాటౌట్‌‌‌‌) కూడా వేగంగా ఆడాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌ జోడించిన తర్వాత రాయ్‌‌‌‌ ఔటయ్యాడు. దీంతో 135/5తో కేకేఆర్‌‌‌‌ ఎదురీత మొదలుపెట్టింది. హిట్టర్​ రసెల్‌‌‌‌ (9), డేవిడ్‌‌‌‌ వీస్‌‌‌‌ (1) ఫెయిల్‌‌‌‌కావడంతో కేకేఆర్‌‌‌‌కు ఓటమి తప్పలేదు.