నలుపు తెలుపు రంగులద్దుకున్న చెన్నై

నలుపు తెలుపు రంగులద్దుకున్న చెన్నై

చెస్ ఒలింపియాడ్ టోర్నీతో  చెన్నై ..నలుపు తెలుపు రంగులను అద్దుకుంది.  రోడ్లు, ఫ్లైఓవర్లు..ఎక్కడ చూసినా..బ్లాక్ అండ్ వైట్ రంగులే కనిపిస్తున్నాయి. చెస్ గడులతో చెన్నైను నింపేశారు. చెస్ పావులతో ఆకర్షణీయంగా మార్చేశారు. చెస్ బోర్డును ప్రతిబింబించేలా నలుపు, తెలుపు గళ్లతో  ఫ్లై ఓవర్లు దర్శనమిస్తున్నాయి. 

అటు చెస్ ఒలింపియాడ్ ఆరంభ వేడుకలు తమిళనాడు సంప్రదాయాన్ని..తమిళ వారసత్వాన్ని తెలిపే విధంగా నిర్వహించారు.  మనసును మైమరిపించే సంగీతం..తనువును ఆడించే నృత్యం క్రీడాకారులను అలరించింది. మ్యూజిక్ బ్యాండ్ తో పాటు ఇసుక చిత్రాలు..వివిధ దేశాల పతాకాలు..ఆద్యంతం ఆరంభ వేడుకలు గొప్పగా సాగాయి. తమిళ రాజుల ఘనతలు, వారి సంప్రదాయం, సంస్కృతి, ప్రాచీన క్రీడలను ప్రతిబింబించే ప్రదర్శనలు, వీడియోలు ఆకట్టుకున్నాయి. ఈ వీటికి నటుడు కమల్ హాసన్ తన గొంతును అందించడం విశేషం. అంతేకాదు భారత దేశ ఎనిమిది సంప్రదాయ నృత్య కళలను ఆరంభ వేడుకల్లో ప్రదర్శించారు.

చెస్ ఒలింపియాడ్ ప్రారంభ వేడుకలను చూసి  చెస్ ప్లేయర్లు  ఆశ్యర్యపోయారు. చెన్నై తమకు బాగా నచ్చిందని..ఏర్పాట్లు, వసతులు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఫుడ్ చాలా బాగుందని,  రోడ్లు చెస్ బోర్డులను తలపించడం ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.