సీఎస్‌కే కుమ్మేసింది..

సీఎస్‌కే కుమ్మేసింది..

నవీ ముంబై: చెన్నై సూపర్ కింగ్స్​కు మరో విక్టరీ. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సీఎస్ కే ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్​లో 91 రన్స్​తో  ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుచేసింది. దాంతో, చెన్నై నాలుగో విజయం కైవసం చేసుకోగా.. ఢిల్లీ ఆరోసారి ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 208/6 భారీ స్కోరు చేసింది. డేవాన్ కాన్వే (49 బాల్స్ లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్​ (3/42) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేజింగ్ లో 17.4 ఓవర్లలో 117 రన్స్ కు ఆలౌటైన ఢిల్లీ ఓడిపోయింది. మిచెల్ మార్ష్ (25), శార్దూల్ (24), పంత్ (21), వార్నర్ (19) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. మొయిన్ అలీ (3/13), సిమర్జీత్ (2/27), ముకేశ్ (2/22),  బ్రావో (2/24) ధాటికి..  భరత్ (8), పావెల్ (3), రిపల్ (6), అక్షర్ (1), కుల్దీప్ (5), ఖలీల్ (0) వరుసగా పెవిలియన్‌‌‌‌ చేరారు. కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. 

చెన్నై ధనాధన్
మొదట బ్యాటింగ్​లో చెన్నై ఓపెనర్లు రుతురాజ్(41), కాన్వే సెంచరీ భాగస్వామ్యంతో సత్తా చాటారు. బాదడమే లక్ష్యంగా పెట్టుకున్న కాన్వే 27 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 10 ఓవర్లకే స్కోరు 100 దాటించాడు. కాసేపటికి గైక్వాడ్ ఔటైనా.. కాన్వేతో కలిసి దూబే (32) రెచ్చిపోయాడు. రాయుడు (5), అలీ (9), ఊతప్ప (0) విఫలమైనా చివర్లో ధోనీ (21 నాటౌట్) మెరుపులతో చెన్నై స్కోర్ 200 దాటింది.