CSK vs MI: చెన్నై సూపర్...రోహిత్ సేనపై విక్టరీ

CSK vs MI: చెన్నై సూపర్...రోహిత్ సేనపై విక్టరీ

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ మరో సారి ఓడిపోయింది. మాజీ ఛాంపియన్ల పోరులో చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 158 పరుగుల టార్గెట్ను చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేధించింది. 

158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్..ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. డివాన్ కాన్వే డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రహానే జట్టును ఆదుకున్నాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి  రెండో వికెట్కు 82 పరుగులు జోడించాడు. ఇదే క్రమంలో 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో 61 పరుగులు సాధించాడు. ఆ తర్వాత పియూష్ చావ్లా బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

గైక్వాడ్..రాయుడు ముగించారు..

రహానే తర్వాత బ్యాటింగ్కు దిగిన శివం దుబె రుతురాజ్ గైక్వాడ్తో కలిసి జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. అయితే లక్ష్యానికి చేరువయ్యాక..దుబె (28) కార్తీకేయ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. ఈ సమయంలో రుతురాజ్కు అంబటి రాయుడు జతకలిశాడు. వీరిద్దరు మరో వికెట్ పడనీయకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.  ముంబై బౌలర్లలో బెహెరెండఫ్, పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన  ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది.  ఓపెనర్లు రోహిత్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 21), ఇషాన్ కిషన్ ధాటిగానే ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే  తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ లో  రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై 38 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్(12) కలిసి ఇషాన్ బౌండరీల‌తో విరుచుకుపడ్డాడు.

ఈ సమయంలో రంగంలోకి దిగిన జడేజా..ఇషాన్ కిషన్‌నుపెవిలియన్ చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్(1)ను మిచెల్ సాంట్నర్ ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే గ్రీన్‌ను జడేజా పెవిలియన్ చేర్చగా....క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్(2)ను సాంట్నర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తిలక్ వర్మ(22) కొద్దిసేపు విరుచుకుపడినా..జడేజా బౌలింగ్ లో  ఎల్బీగా ఔట్ అయ్యాడు.  ట్రిస్టన్  స్టబ్స్‌ను కళ్లు చెదిరే క్యాచ్‌తో మగాల ఔట్ చేశాడు. టీమ్ డేవిడ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా....దేశ్ పాండే అతన్నిపెవీలియన్ చేర్చాడు. చివర్లో హృతిక్ షోకీన్ మూడు బౌండరీలు బాదడంతో ముంబై  20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులు సాధించింది.  చెన్నై బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, సాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మగాలకు ఒక వికెట్ దక్కింది.