చెన్నై బ్యాట్స్మన్ విఫలం..కోల్కతాకు స్వల్ప టార్గెట్

చెన్నై  బ్యాట్స్మన్ విఫలం..కోల్కతాకు స్వల్ప టార్గెట్

సొంతగడ్డపై కోల్ కతాతో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ స్వల్ప స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులే చేసింది. శివమ్ దుబె 48 పరుగులు చేయగా..డివాన్ కాన్వే 30 పరుగులతో రాణించాడు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్కు 31 పరుగులు జోడించారు. అయితే 17 పరుగులు చేసిన రుతురాజ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రహానే 16 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. 30 పరుగులు చేసిన డివాన్ కాన్వేను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. అంబటి రాయుడు 4 పరుగులే చేసి నిష్క్రమించాడు. మోయిన్ ఆలీ (1) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో చెన్నై 72 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

ఆదుకున్న శివమ్ దుబే ,జడేజా 

ఈ సమయంలో వికెట్ల పతనాన్ని శివమ్ దుబే, జడేజా అడ్డుకున్నారు. కోల్ కతా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 6వ వికెట్ కు 68 పరుగులు జోడించారు. అయితే 140 పరుగుల వద్ద జడేజా (20) ఔటయ్యాడు. శివమ్ దుమే (48) నాటౌట్ గా నిలిచాడు.  కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.