కోహ్లీ ఆట ఇంకా మిగిలే

కోహ్లీ ఆట ఇంకా మిగిలే

ఆసియాకప్లో విరాట్ కోహ్లీ అద్బుత సెంచరీతో చెలరేగాడు. వెయ్యి రోజుల తర్వాత తొలి సెంచరీ కొట్టాడు. అంతేకాదు..టీ20ల్లో ఫస్ట్ సెంచరీ నమోదు చేయడంతో..పాటు..71వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.  దీంతో  ఇన్నాళ్లు కోహ్లీని విమర్శించిన వారు..పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కోహ్లీ పనైపోయిందన్న వారు..విరాట్లో ఏమాత్రం సత్తువ తగ్గలేదని చెప్తున్నారు. కొందరు..విరాట్ బ్యాక్..కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీపై చెన్నై సూపర్ కింగ్స్  కోహ్లీపై చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి.

 

ఆట ఇంకా మిగిలే ఉంది..
ఆఫ్ఘనిస్తాన్పై కోహ్లీ సెంచరీ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభినందనలు తెలిపింది. ఇందులో భాగంగా కోహ్లీని కింగ్ ఈజ్ బ్యాక్ అనాల్సిన అవసరం లేదని చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది. కోహ్లీ పోరాట యోధుడని చెప్పుకొచ్చింది. కోహ్లీ ఎక్కడికైనా వెళ్లాడా..? లేదు కదా..మరి కింగ్ ఈజ్ బ్యాక్ అని  ఎందుకు అంటున్నారని అని ఫ్యాన్స్ను ప్రశ్నించింది. కోహ్లీ ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాడని..ప్రశంసించింది. ఎప్పుడైనా కోహ్లీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని..ఎన్ని అడ్డంకులైనా అతన్ని ఆపలేరని చెప్పింది. కోహ్లీ ఆట ఇంకా మిగిలే ఉంది..అని ట్వీట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్గా మారాయి. సీఎస్కే ట్వీ్ట్స్కు ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. 

సెంచరీతో రికార్డులు..
71వ సెంచరీతో చెలరేగిన కోహ్లీ..పలు రికార్డులను కొల్లగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 71వ సెంచరీ బ్యాట్స్మన్గా కోహ్లీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా సెంచరీల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు..ఈ సెంచరీతో అంతర్జాతీయ కెరీర్లో 24 వేల పరుగుల మైలురాయికి విరాట్ చేరుకున్నాడు. క్రికెట్లో 24వేల రన్స్ చేసిన ఆరో బ్యాట్స్మన్గా చరిత్రకెక్కాడు. అటు టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్మన్గా రికార్డుకెక్కాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో 100సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా అంతర్జాతీయ కెరీర్లో కోహ్లీ 250 సిక్సులు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో 3500పరుగుల మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఆసియా కప్ 2022లో అత్యధిక పరుగులు  (276) చేసిన బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు.