CSK vs GT: చెన్నై విశ్వరూపం..చిత్తు చిత్తుగా ఓడిన గుజరాత్

CSK vs GT: చెన్నై విశ్వరూపం..చిత్తు చిత్తుగా ఓడిన గుజరాత్

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 63 పరుగులు భారీ తేడాతో నెగ్గింది. 207 పరుగుల ఛేజింగ్ లో సాయి సుదర్శన్(37) మినహాయిస్తే.. ఏ ఒక్కరు కూడా కనీస ప్రదర్శన చేయలేదు. దీంతో 20 ఓవర్లలో 143 పరుగులకే పరిమితమైంది.    

భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. తొలి వికెట్ కు 2.3 ఓవర్లోనే వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసి లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయితే దీపక్ చాహర్ గిల్(8) వికెట్ తీయడంతో గుజరాత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. సహా(21), విజయ్ శంకర్(12) త్వరగా ఔట్ కావడంతో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిల్లర్(21), సాయి సుదర్శన్ 41 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా డారిల్ మిచెల్ ఈ జోడీని విడదీసాడు. మిల్లర్ ఔట్ తో గుజరాత్ పరాజయం ఖరారైంది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, ముస్తఫిజుర్ రెహమాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివమ్ దూబే 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రచీన్ రవీంద్ర (46) మెరుపులు మెరిపించగా గైక్వాడ్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా.. సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.