CSK vs RR : టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న చెన్నై

CSK vs RR : టాస్ గెలిచి ఫీల్డింగ్  తీసుకున్న చెన్నై

చెన్నై వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై, రాజస్థాన్ జట్లు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించాయి.  ఇప్పటివరకు ఇరుజట్లు  26 మ్యాచుల్లో తలపడగా  చెన్నై 15 మ్యాచుల్లో విజయం సాధించగా.. రాజస్థాన్‌ 11 మ్యాచుల్లో గెలిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు   కెప్టెన్‌గా ధోనీకిది 200వ మ్యాచ్‌ కావడం విశేషం. 

రాజస్థాన్‌

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), దేవదత్‌ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్‌మయర్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ సేన్‌, సందీప్‌ శర్మ, చాహల్‌.

చెన్నై :  


రుతురాజ్‌ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), మగాలా, మహీశ్ తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్‌.