నీళ్లకోసం రోడ్డెక్కిన తమిళులు

నీళ్లకోసం రోడ్డెక్కిన తమిళులు

నీటి కోసం తమిళ ప్రజలు రోడ్డెక్కారు. రాష్ట్రమంతటా నీటి కష్టాలపై డీఎంకే ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన  చేపట్టారు. ఖాళీ  బిందెలతో చెన్నెలో భారీ ర్యాలీ తీశారు. గృహ అవసరాలతో పాటు.. తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు ప్రజలు.

నిరసనల్లో డీఎంకే అధినేత స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం ముందుచూపు లేని విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. నీరు లేక  ప్రజలు అల్లాడుతోంటే..  పళనిసామి  సర్కారుకు పట్టింపే లేకుండా పోయిందని ఫైరయ్యారు డీఎంకే  చీఫ్ స్టాలిన్. నీటి సరఫరాకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.