కోటపల్లి వరద బాధితులను ఆదుకోవాలని.. సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ లేఖ

కోటపల్లి వరద బాధితులను ఆదుకోవాలని.. సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ లేఖ
  •  ప్రాణహితకు వరదతో 3,725 ఎకరాల్లో పంట నష్టం
  •  జీవనోపాధి కోల్పోయిన 1,985 మంది రైతులు 
  •  సాయం అందించి ఆదుకోవాలి

హైదరాబాద్: ప్రాణహిత వరదల కారణంగా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో పంట నష్టం జరిగిందని, రైతులు తమ జీవనోపాధి కోల్పోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాణహిత నది వరదల కారణంగా కోటపల్లి మండలంలోని  3,725 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,  1,985 మంది రైతులు తమ జీవనోపాధి కోల్పోయారని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక మేటలు వేసిన వారి పొలాల్లో వ్యవసాయం చేసుకునేలా సాంత్వన చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.