మాలల జాగృతం కోసమే సింహగర్జన సభ: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

మాలల జాగృతం కోసమే సింహగర్జన సభ: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

జూబ్లీహిల్స్, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో డిసెంబర్​1న తలపెట్టిన మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆల్​ మాల స్టూడెంట్స్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సభ పోస్టర్లను సోమాజిగూడలోని తన నివాసంలో వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం మాలలందరినీ ఏకం చేసేందుకు సభ నిర్వహిస్తున్నామన్నారు. మాలజాతి జాగృతం కోసమే సింహగర్జన సభ అన్నారు. మాల నాయకులు నీరడి సూర్యం, జి.చెన్నయ్య, సర్వయ్య, భాస్కర్, బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాంచందర్​తదిరులు 
పాల్గొన్నారు.