కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తాం: వివేక్ వెంకటస్వామి

కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తాం: వివేక్ వెంకటస్వామి

కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలి 16 వ వార్డులో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి...అభయ హస్తం దరఖాస్తు అందరూ  చేసుకునేలా చూడాలన్నారు. ఎవరైతే అప్లై చేయని వాళ్లు ఉంటే..అధికారులు వాళ్ల ఇంటికి  వెళ్లి మట్లాడాలన్నారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు  సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని  చెప్పారు వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే మహిళలకు ఫ్రీ జర్నీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు అమలు చేస్తున్నామన్నారు.రూ.5 లక్షలతో ఇందిరమ్మ  ఇళ్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తుందన్నారు.