- నాడు ఆటోలు కూడా పోని గల్లీలకు నేడు అంబులెన్సులు వస్తున్నయ్
- మార్నింగ్‌వాక్‌లో సమస్యలు తెలుసుకొని పరిష్కరించిన మంత్రి వివేక్
- హర్షం వ్యక్తం చేస్తున్న చెన్నూర్ పట్టణ ప్రజలు
ఇది చెన్నూరు మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని మారెమ్మవాడ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ వార్డులో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి ఇది. రోడ్డు పూర్తిగా శిథిలమై, మురుగునీరు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.200 ఇస్తామన్నా రోడ్ల పరిస్థితి కారణంగా ఈ వాడకు ఆటోలు కూడా వచ్చేవి కావు. 2020లో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం వేసి పనులు చేయడం మర్చిపోయారు.
మారెమ్మవాడలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు ఇది. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గెలిచిన తర్వాత మార్నింగ్ వాక్‌లో పట్టణంలోని గల్లీలన్నీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మారెమ్మవాడలో రోడ్లు, డ్రైనేజీల దుస్థితిని చూసి చలించిపోయారు. ఫండ్స్సాంక్షన్చేసి సీసీ రోడ్డు నిర్మించారు. డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి.
చెన్నూరు, వెలుగు: చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల రూపురేఖలు మారుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని వార్డుల్లో ఇప్పుడు డెవలప్మెంట్పనులు జోరుగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వివేక్‌వెంకటస్వామి చొరవతో దశాబ్దాల కాలంగా ప్రజలు పడుతున్న కష్టాలు తీరుతున్నాయి. మంత్రి వివేక్ మార్నింగ్ వాక్‌లో చెన్నూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
అందుకు అనుగుణంగా వార్డుల్లో సమస్యలు తీరేందుకు చెన్నూరు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.27 కోట్లు కేటాయించారు. 18 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి.. అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి పనులు స్పీడప్ చేశారు. దీంతో ఇప్పటికే పలు వార్డుల్లో నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా వార్డుల్లో జోరుగా నడుస్తున్నాయి. త్వరలోనే అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మారిన రూపురేఖలు
చెన్నూరు పట్టణంలోని నల్లగొండ పోచమ్మవాడ, బేతాళవాడలలో గత 30 ఏండ్లుగా రోడ్లు, నాలాలు లేకుండా ఆ వార్డుల్లోని బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడో దశాబ్దాల కిందట వేసిన రోడ్లు పూర్తిగా శిథిలమై ప్రజలు నరకం అనుభవించారు. 4,11 వార్డుల ప్రజలు బస్టాండ్‌కు వెళ్లాలంటే రూ. 200 ఇచ్చినా ఆటోలు వచ్చేవి కాదు. ఎమర్జెన్సీ టైమ్‌లో 108 అంబులెన్సు కూడా వచ్చేది కాదు. ఎలక్షన్లకు ముందు, ఆ తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ వార్డుల్లోకి వెళ్లినప్పుడు ప్రజలు వారి కష్టాలను విన్నవించారు. దీంతో చలించిన మంత్రి వెంటనే పనులు ప్రారంభిస్తానని వారికి మాట ఇచ్చారు. మొన్నటి మున్సిపల్ఎన్నికలకు ముందు ఆ వార్డులకు రూ.2 కోట్ల ఫండ్స్ కేటాయించి రోడ్లు, డ్రైనేజీల పనులు చేపట్టారు. ఇప్పుడు రోడ్లు అద్దంలా మెరిపోతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రికి రుణపడి ఉంటాం
గత 30 ఏళ్లుగా మారమ్మవాడ, బేతలవాడలకు రోడ్డు సౌకర్యం లేక ఆటోలు, అంబులెన్సులు రాకపోయేది. వృద్ధులు, గర్భిణులు, రోగాలబారిన పడినవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. మంత్రి వివేక్మా వాడకు ఓట్ల కోసం వచ్చినప్పుడు పరిస్థితిని చెప్పుకున్నం. ఇచ్చిన మాట ప్రకారం మా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఇప్పుడు రూ.20 ఇస్తే ఆటోవాళ్లు వస్తున్నారు. మా ఏరియాను బాగుచేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి రుణపడి ఉంటాం. - ధర్మపురి జ్యోతి, మారెమ్మవాడ, చెన్నూరు

