
హైదరాబాద్, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, సర్కారు అండగా ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట నష్టపోయినవారికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్టు చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతుల కు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు.