కమ్యూనిస్టుల మద్దతుతో .. కాంగ్రెస్​ గెలుపు తథ్యం : వివేక్​ వెంకటస్వామి

కమ్యూనిస్టుల మద్దతుతో  .. కాంగ్రెస్​ గెలుపు తథ్యం : వివేక్​ వెంకటస్వామి
  • పేదల కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నరు
  • చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి
  • కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ శ్రేణులు

కోల్​బెల్ట్, వెలుగు:  పేదల కోసం కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తున్నారని.. సీపీఐ, ఏఐటీయూసీ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని​చెన్నూరు కాంగ్రెస్​అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి అన్నారు. బుధవారం రాత్రి ఆయన మందమర్రిలోని ఏఐటీయూసీ ఆఫీస్​లో యూనియన్​ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అహంకారి బాల్క సుమన్​ను ఓడించేందుకు సీపీఐ, ఏఐటీయూసీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా వివేక్​ను యూనియన్​ లీడర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్ ​వాసిరెడ్డి సీతారామయ్య, సెంట్రల్ ​కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యులు కలవేని శంకర్, జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు భీమనాథుని సుదర్శనం, పౌల్​ తదితరులు పాల్గొన్నారు. హిందూ గార్డెన్స్​లో జరిగిన నేతకాని కుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలోనూ వివేక్​ పాల్గొనగా.. సంఘం నేతలు ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 

యాకుబ్​ అలీ చేరికతో మరింత బలం

బీఆర్ఎస్​ సీనియర్​ లీడర్, మాజీ జడ్పీటీసీ, క్యాతనపల్లి మున్సిపల్​ కౌన్సిలర్​ఎండీ యాకుబ్​అలీ కాంగ్రెస్ లో ​ చేరడం పార్టీకి మరింత బలాన్నిస్తుందని వివేక్​ వెంకటస్వామి అన్నారు. మందమర్రి ఏరియా కేకే-5 గని వద్ద యాకుబ్​అలీకి కాంగ్రెస్​ కండువా వేసి ఆహ్వానించారు. ప్రతి ఎన్నికల్లో యాకుబ్​తోపాటు ఆయన తండ్రి, అన్న తనకు ఎంతో సహకరించారన్నారు. మైనార్టీల అభ్యున్నతికి తోడ్పాటునందిస్తానని ఈ సందర్భంగా వివేక్​చెప్పారు. మందమర్రి ఐఎన్టీయూసీ ఆఫీస్​కు వెళ్లిన వివేక్​కు ఆ పార్టీ నేత రామిల్ల రాధిక మద్దతు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ వేవ్​ నడుస్తోందని.. చెన్నూరులో వివేక్​ వెంకటస్వామి గెలుపు ఖాయమని రాధిక పేర్కొన్నారు.

 కాంగ్రెస్​లో చేరికలు

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపతినగర్, వెంకటేశ్వరస్వామి టెంపుల్​ఏరియా, రెండో జోన్, విద్యానగర్, మారుతీనగర్, గాంధీనగర్ లో జరిగిన​ చేరికల్లో వివేక్​కు మద్దతుగా ఏఐటీయూసీ, నేతకాని సంఘం నేతలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​కు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. వారికి వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారంలో లీడర్లు నూకల రమేశ్, దుర్గం నరేశ్, సొత్కు సుదర్శన్, నల్లాల క్రాంతి, గుడ్ల రమేశ్, బండి సదానందం, మహంకాళి శ్రీనివాస్, పైడిమల్ల నర్సింగ్, అబ్దుల్​అజీజ్, గోపతి రాజయ్య,  నల్లాల క్రాంతికుమార్, గుడ్ల రమేశ్, పుల్లూరి లక్ష్మణ్, కడారి జీవన్, బత్తుల రమేశ్, సత్యపాల్, ముజాహిద్, ఇషాక్, జావెద్, శివకిరణ్, అర్జున్, శ్రీనివాస్, విజయ్​కుమార్, గడ్డం రజనీ, అనూష, రాధ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్​ను వదలను: ఓదెలు

తాను పార్టీ మారుతున్నానని బాల్క సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని.. తన గొంతులో ప్రాణముండగా కాంగ్రెస్ ను విడిచిపెట్టనని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. మందమర్రి, క్యాథనపల్లి మున్సిపాలిటీల్లో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదన్నారు. బాల్క సుమన్ దుర్మార్గుడని.. ఆ మోసగాడైన  ఎమ్మెల్యేకు ఓట్లతో బుద్ధి చెప్పే టైం వచ్చిందన్నారు. చెన్నూరులో కాంగ్రెస్ ఆదరణ చూసి బాల్క సుమన్ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించాడు. వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

బాల్క సుమన్ అణిచివేత భరించలేక కాంగ్రెస్ లో చేరినం

జైపూర్(భీమారం): భీమారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు బుధవారం సీనియర్ లీడర్ చేకుర్తి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరగా వారికి వివేక్​కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భీమారం మాజీ ఉప సర్పంచ్ అమర్ సింగ్, మండల మాజీ యూత్ ప్రెసిడెంట్ ఆవుల సురేశ్, లీడర్లు దాసరి ప్రకాశ్, తైనేని రవి, చింతల శ్రీనివాస్, భూనేని సుధాకర్, పందుల మధుకర్, రేణిగుంట అశోక్, సుంకరి మహేశ్, రాములు, మల్లేశ్​ ఉన్నారు. వారు మాట్లాడుతూ బాల్క సుమన్ అణిచివేత భరించ లేక కాంగ్రెస్ లో చేరామని, వివేక్ గెలుపుకు కృషి చేస్తామన్నారు.