చర్లపల్లి జైల్లో ఇన్నోవేషన్స్..యోగ సెంటర్, మినీ గోల్ఫ్‌ కోర్ట్‌

చర్లపల్లి జైల్లో ఇన్నోవేషన్స్..యోగ సెంటర్, మినీ గోల్ఫ్‌ కోర్ట్‌

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర జైళ్ల శాఖ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్ జైల్లో యోగ సెంటర్‌‌, అడ్వెంచర్‌ ‌జోన్, మినీ గోల్ఫ్‌కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి  జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రాతో కలిసి డీజీపీ జితేందర్‌ శనివారం ప్రారంభించారు. 

దీని ద్వారా విద్యార్థుల్లో  సాగు పద్ధతులు, వ్యవసాయం ప్రాముఖ్యతను  పెంపొందించే విధంగా ఇన్నోవేషన్‌ చేయనున్నారు. విడుదలైన ఖైదీలు, ఓపెన్‌ జైల్‌ ఖైదీలకు ఉపాధి, ఉద్యోగ శిక్షణను అందించే విధంగా ప్రాజెక్ట్‌ ఉపయోగపడుతుందని  జితేందర్‌‌, సౌమ్య మిశ్రా వెల్లడించారు.