100 టెస్టులో విన్నింగ్ షాట్ కొట్టిన పుజారా

100 టెస్టులో విన్నింగ్ షాట్ కొట్టిన పుజారా

బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా ఆసీస్‌ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ లో ముందంజలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ తో వందో టెస్టు మ్యాచ్ ను పూర్తి చేసుకున్న ఛెతేశ్వర్‌ పుజారా విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ను ముగించాడు. పుజారాకు ఇదొక విన్నింగ్‌ గిఫ్ట్‌ అని  చెప్పాలి.  తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన పుజారా...  రెండో ఇన్నింగ్స్ లో మాత్రం నిలకడగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.  కాగా 4 టెస్టుల సిరీస్ లో టీమిండియా ప్రస్తుతం  2–0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్  మార్చి1న ఇండోర్ లో స్టార్ట్ కానుంది.