చేవెళ్ల కాంగ్రెస్​అభ్యర్థి మార్పు?.. పరిశీలనలో షాదాబ్​ దర్శన్ పేరు

చేవెళ్ల కాంగ్రెస్​అభ్యర్థి మార్పు?.. పరిశీలనలో షాదాబ్​ దర్శన్ పేరు

హైదరాబాద్, వెలుగు :  ఇప్పటికే ప్రకటించిన చేవెళ్ల అభ్యర్థిన మార్చాలని కాంగ్రెస్​ భావిస్తోంది. అక్కడి నుంచి షాదాబ్​ దర్శన్  పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు నియోజకవర్గం బీఫాంను పెండింగ్​లో పెట్టిన ఏఐసీసీ.. షాదాబ్​ను ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం.

కాగా చేవెళ్ల కాంగ్రెస్​ సీటు మారుస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని, తనను పార్టీ హైకమాండ్​ గాంధీ భవన్​కు పిలిచి మాట్లాడిందని, నామినేషన్​ను చెక్​ చేసుకోమని చెప్పిందని చేవెళ్ల స్థానం నుంచి ఇప్పటికే పేరు ప్రకటించిన ఆ పార్టీ అభ్యర్థి భీంభరత్ స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్​ అభ్యర్థులకు బీఫాంల పంపిణీ రెండో రోజు కొనసాగింది. సోమవారం 15 మంది అభ్యర్థులు బీఫాంలు తీసుకున్నారు.