ఎమ్మెల్యే కారును అడ్డుకున్న భూ నిర్వాసితులు

ఎమ్మెల్యే కారును అడ్డుకున్న భూ నిర్వాసితులు

చేవెళ్ల, వెలుగు: ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ నుంచి భూమిని తీసుకున్నారని.. ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదంటూ బాధితులు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యను  అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్ వెల్లి సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమి సేకరించింది. అయితే, ఇప్పటివరకు పార్కు ఏర్పాటు చేయకపోగా.. వారికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు.

శనివారం షాబాద్ మండలంలో పర్యటించిన యాదయ్య చేవెళ్లకు వెళ్తుండగా.. మార్గమధ్యలోనే భూ నిర్వాసితులు ఆయన కారును అడ్డుకున్నారు. తమ నుంచి బలవంతంగా భూమిని లాక్కుని పరిహారం కూడా ఇవ్వలేదని ఎమ్యెల్యే ను నిలదీశారు.  కారుకు అడ్డుపడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల వారికి చెదరగొట్టగా యాదయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.