బీఆర్‌‌‌‌ఎస్ నిరంకుశ పాలనను అంతం చేయాలి : భీం భరత్

చేవెళ్ల, వెలుగు : బీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతం చేయాలని చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ పిలుపునిచ్చారు. శనివారం శంకర్​పల్లి మండల పరిధిలోని శేరిగూడ, కొండకల్, కొండకల్ తండా, మోకిల తండా, మోకిల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీం భరత్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కాంగ్రెస్​లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  తెలంగాణలో ఇంకా రాచరిక పాలన కొనసాగుతుందన్నదన్నారు.  

బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 