
చేవెళ్ల, వెలుగు: ఓ వైన్ షాపులో చోరీ జరిగిన ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ వైన్ షాపు గోడకు శనివారం అర్ధరాత్రి దుండగులు రంధ్రం చేసి, చొరబడ్డారు. 28 మద్యం బాటిళ్లు, క్యాష్కౌంటర్లోని రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. ఆదివారం షాపు యజమాని విజయపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.