
చత్తీస్ ఘడ్ బీజాపూర్ లో IEDపేలుడులో ప్రాణాలు కోల్పోయిన జవాను అంత్యక్రియాల్లో ఆరాష్ట్ర సీఎం విష్ణు డియో సాయి పాల్గొన్నారు. అమరుడైన భరత్ లాల్ సాహు జవాను మృతదేహానికి నివాళులర్పించారు. పేలుడులో గాయపడ్డ జవాన్లు కూడా త్వరగా కోలుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నక్సలిజానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నామని.. నక్సలిజాన్ని అంతంచేస్తామని ఆయన అన్నారు. బీజాపూర్ లో మందుపాతర పేలిన ఘటనలో చనిపోయిన భరత్ లాల్ సాహు అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించింది.