హుజురాబాద్ ఉప ఎన్నిక: ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం

హుజురాబాద్ ఉప ఎన్నిక: ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందన్నారు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్. అన్ని ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పోలింగ్ జరిగిందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన క్రమంలో  బుద్ధభవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదులపై  పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారని తెలిపారు. డబ్బులు పంచుతున్నట్లు అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని..వాటిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు శశాంక్ గోయల్.

ఈవీఎంలను సీల్ చేసిన ఎన్నికల సిబ్బంది...వాటిని కరీంనగర్ జిల్లాలోని  SRR డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన  స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తామన్నారు. ఇంకా కొన్ని సెంటర్లలో  పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు.

2018 సాధారణ ఎన్నికతో పోలిస్తే  ఈ ఉప ఎన్నికలో పొలింగ్ శాతం పెరిగిందన్నారు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్.