చేయాల్సిన పనులు చేస్తలేరు

చేయాల్సిన పనులు చేస్తలేరు
  • గవర్నర్ల తీరుపై జస్టిస్ బీవీ నాగరత్న విమర్శ

న్యూఢిల్లీ: గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న కీలక కామెంట్లు చేశారు. కొంతమంది గవర్నర్లు వాళ్లు చేయాల్సిన పనులు వదిలేసి, ఇతర పనులు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టులో కేసులు నమోదవుతుండడం బాధాకరమని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య విభేదాలు ఉండడం.. గవర్నర్లు బిల్లులు ఆమోదించడం లేదని ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుండడంతో ఈ కామెంట్లు చేశారు.

బెంగళూర్ లోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)లో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో జస్టిస్ నాగరత్న మాట్లాడారు. గవర్నర్ న్యూట్రల్ గా ఉండాలని, పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు మధ్య ఘర్షణ వాతావరణంపై స్పందిస్తూ.. రాష్ట్రాలేమీ కేంద్రానికి సబార్డినేట్ కాదని అన్నారు.