బెస్ట్ సీఎంల లిస్ట్: 2వ స్థానంలో జగన్.. కేసీఆర్..?

V6 Velugu Posted on May 08, 2021

భారత్ లో  బెస్ట్ సీఎంల  జాబితా రిలీజ్  చేసింది  ముంబైకి చెందిన  ఆర్మాక్స్   మీడియా. ఒడిశా సీఎం నవీన్  పట్నాయక్  టాప్ వన్ లో  నిలిచారు. ఏపీ  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్  రెండో స్థానం దక్కించుకున్నారు.  ఆర్మాక్స్ నిర్వహించిన   సీఎం అప్రూవల్  సర్వేలో  నవీన్ పట్నాయక్ కు  57 పర్సంట్   రేటింగ్ వచ్చింది.   ఏపీ సీఎం  జగన్ కు   55 శాతం రేటింగ్  వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్... 46 శాతం  రేటింగ్ తో  15 వ  స్థానంలో నిలిచారు.  కేరళ సీఎం  పినరయ్ విజయన్.... అస్సాం  సీఎం   సర్బానంద సోనోవాల్  54 శాతం  రేటింగ్ తో  థర్డ్ ప్లేస్ లో  ఉన్నారు. యూపీ   సీఎం యోగి  ఆదిత్యనాథ్   నాలుగో స్థానంలో  ఉండగా... 51 శాతం  రేటింగ్ తో బెంగాల్ సీఎం  మమతాబెనర్జీ   ఫిప్త్ ప్లేస్ లో  ఉన్నారు. ఆరో  స్థానంలో  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... మధ్యప్రదేశ్ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్   , బీహార్  సీఎం నితీశ్ కుమార్ , మహారాష్ట్ర  సీఎం ఉద్దవ్ థాక్రే  పదో స్థానంలో ఉన్నారు.

 

 

Tagged KCR, jagan, Chief Minister, top 10, Approval Rating , most-approve CM, July 2020

Latest Videos

Subscribe Now

More News