ఖమ్మం : ఆగస్టు 30 వరకు యూనిఫాంలు అందించాలి

ఖమ్మం : ఆగస్టు 30 వరకు యూనిఫాంలు అందించాలి

ఖమ్మం టౌన్, వెలుగు : ఆగస్టు 30 నాటికి ప్రభుత్వ, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ పాఠశాలల విద్యార్థులందరికీ రెండు జతల నాణ్యమైన యూనిఫాంలను అందించేలా కుట్టు పనులను  పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో యూనిఫాంల కుట్టు పనుల పురోగతి, సీజనల్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై సమీక్షించారు. ఇందులో ఖమ్మం నుంచి కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. 

అనంతరం కలెక్టర్ ఆఫీసర్లతో సమావేశమై ఎల్నినో ప్రభావం దృష్ట్యా తాగునీటి కొరత తలెత్తకుండా గ్రామాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథతో పాటు స్థానిక నీటి వనరులను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మరో సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, రోడ్డు భద్రతపై ఎలాంటి రాజీ లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు.